హైదరాబాద్ : ఓకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన మహిళ..!

ఇటీవల కరీంనగర్ లో ఓ మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెగ వైరల్ అయింది. కాగా ఇప్పుడు మన హైదరాబాదులో ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. మినా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో 27 ఏళ్ల మహిళ మొత్తం నలుగురికి జన్మనిచ్చింది. కాగా ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. వీరిలో ముగ్గురు ఆడపిల్లలు కాగా ఒక ఒక బాబు ఉన్నాడు.

మహిళకు గైనాకాలజిస్ట్ సోహెబా షుకో చికిత్స చేసి నలుగురు పిల్లలను క్షేమంగా బయటకు తీసింది. ఇక మహిళకు ఇదే మొదటి కాన్పు కావడం తో కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందం తో ఉన్నారు. ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టి ఆరోగ్యంగా ఉండటం తో తల్లి దండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.