మహిళలూ గుండె ఆరోగ్యం కోసం వీటిని తప్పక పాటించాలి..!

-

ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు మీరు కూడా హృదయ సంబంధిత సమస్యలేమీ లేకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..? అయితే మహిళలు కచ్చితంగా వీటిని తప్పక పాటించండి వీటిని అనుసరిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటే వయసు పెరిగినా కూడా హృదయ సంబంధిత సమస్యలు తలెత్తవు. మరి ఇక మహిళలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి…? ఎలాంటి నియమాలని పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం…

ఫిజికల్ యాక్టివిటీ చాలా ముఖ్యం. చాలా మంది ఈ రోజుల్లో ఫిజికల్ యాక్టివిటీ కోసం సమయాన్ని వెచ్చించమే లేదు. కానీ నిజానికి ఫిజికల్ యాక్టివిటీ కోసం సమయాన్ని వెచ్చిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలానే గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. కండరాలకి బ్లడ్ ఫ్లో కూడా బాగా అందుతుంది కనుక ఫిసికల్ యాక్టివిటీ కోసం సమయాన్ని ఇవ్వండి. ఆరోగ్యకరమైన డైట్ ని ఫాలో అయితే కూడా కచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు హృదయపూర్వక సమస్యలేమీ లేకుండా హాయిగా ఉండొచ్చు. కూరగాయలు పండ్లు వంటివి తీసుకుంటూ ఉండండి.

బరువుని కూడా అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో చాలామంది బాధపడుతున్నారు. ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి. టైప్ టు డయాబెటిస్ శ్వాస సంబంధిత సమస్యలు క్యాన్సర్లతో చాలా మంది ఈ రోజుల్లో బాధపడుతున్నారు. అయితే సరైన బరువు ఉండటం చాలా అవసరం. స్మోకింగ్ కి కూడా దూరంగా ఉండడం చాలా అవసరం.

స్మోకింగ్ వలన కూడా రకరకాల సమస్యలు కలుగుతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం మొదలు వివిధ సమస్యలు కలుగుతాయి. స్మోకింగ్ వలన పిల్లలు పుట్టకపోవడం, మిస్ క్యారేజ్, ప్రీమెచూర్ బర్త్స్ వంటివి కలుగుతున్నాయి. స్మోకింగ్ అలవాటుకి దూరంగా ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. హృదయ సంబంధిత సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు కలగవు. రెగ్యులర్ గా ఆరోగ్యాన్ని టెస్ట్ చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం. రెగ్యులర్ చెక్ అప్ చేయించుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది ఇబ్బందుల నుండి బయటపడొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version