హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తన నటనతో, అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. బాలయ్య సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా… హనీరోజ్ తాను కూడా చాలాసార్లు బాడీ షేమింగ్ కు గురైనట్లు చెప్పారు.
ప్రముఖ నటి హనీరోజ్ ‘కెరీర్ మొదట్లో టీవీ షోకు వచ్చిన ఓ వ్యక్తి నా భారీ గురించి నోటికొచ్చినట్లు వాగాడు. దీంతో యాంకర్ పగలబడి నవ్వాడు. ఆ సమయంలో చాలా బాధేసింది’ అని తెలిపారు. అలాంటి ఘటనల నుంచి ఇప్పుడు ఇప్పుడే బయటపడుతున్నానని.. ట్రోల్స్ ను కూడా పట్టించుకోవడం మానేశానని చెప్పారు. ఇటీవల బాలయ్య వీర సింహారెడ్డి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హనీ రోజ్.