మెనోపాజ్‌లో ఎముకలు బలంగా ఉండాలంటే… వీటిని తప్పక తీసుకోండి..!

-

వయసు పెరిగే కొద్దీ మహిళల ఆరోగ్యంలో మార్పు వస్తుంది. వయసు పెరిగే కొద్ది మహిళలు లో అనారోగ్య సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. మెనూ టైం లో మహిళల్లో చాలా మార్పులు వస్తాయి. చాలా సంవత్సరాలు పాటు క్రమం తప్పకుండా వచ్చిన నెలసరి ఆగిపోయే సమయం స్త్రీ పునరుత్పత్తి వయసు అయిపోయిందన్నడానికి ఇది సూచన. మెనోపాజ్ మహిళల్లో 51 సంవత్సరానికి వస్తుంది. ఐదు నుండి ఏడు సంవత్సరాలు ముందు నుండే మహిళల శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి.

అండాశయాల నుండి వచ్చే హార్మోన్లు రిలీజ్ అవ్వవు. ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి ఎముకలు లోపాల క్యాల్షియం విటమిన్ డి నిల్వలు తగ్గి బలహీనంగా మారుతాయి. కొన్ని సార్లు ఒళ్లంతా కూడా మహిళల్లో నొప్పులుగా ఉంటాయి. చిన్న చిన్న దెబ్బలు తగిలినా ఫ్రాక్చర్లు అవడం ఆస్టియోపొరోసిస్ ఇలాంటివి మహిళలు కనపడతాయి. ఈ సమయంలో ఎముకలని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చిట్కాలని పాటించండి. ఎముకల ఆరోగ్యంగా ఉండాలంటే క్యాల్షియం తప్పకుండా తీసుకోవాలి. ఇది చాలా అవసరం. మహిళలు సప్లిమెంట్స్ ని తీసుకోవచ్చు.

ప్రతిరోజు వెయ్యి నుండి 1200 మిల్లీగ్రాములు క్యాల్షియంని తీసుకుంటూ ఉండాలి తగినంత విటమిన్ డి కూడా చాలా అవసరం. మహిళలు ప్రతి రోజూ 600 నుండి 800 ఇంటర్నేషనల్ యూనిట్ ల విటమిన్ డి ని తీసుకుంటూ ఉండాలి. గుడ్లు ఫోర్టిఫైడ్ ఫిష్ పుట్టగొడుగులు ఓట్స్ వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి.

ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి వాకింగ్, డాన్స్ చేయడం, బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు చేస్తే కచ్చితంగా కోల్పోకుండా నిరోధించడానికి అవుతుంది అయితే మహిళలు ఆరోగ్యంగా ఉండడానికి స్మోకింగ్ మద్యపానానికి దూరంగా ఉండాలి ఆరోగ్యకరమైన ఆహారాన్ని డైట్లో చేర్చుకోవాలి. రోజూ కూడా తగినంత సేపు నిద్రపోవాలి బోన్ డెన్సిటీ టెస్ట్ చేయించుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version