క్లబ్ లో బాత్ రూమ్ వెళ్లిన మహిళపై అత్యాచారం..

-

భారతదేశంలో ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నాయి. విదేశాలు మన కట్టుబాట్లకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంటారు.. అంతేకాకుండా.. స్త్రీ మూర్తిని దేవతగా కొలిచే దేశం మనది.. అయితే. ఇలాంటి దేశంలో.. రావణుడిలాంటి.. రాక్షసులు పుట్టుకొస్తున్నారు. అయితే.. ముంబైలోని బ్రిటిష్‌ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న బ్రిటిష్‌ మహిళ (44) మంగళవారం బాంద్రాలోని ఓ క్లబ్‌ కు వచ్చింది.. అయితే ఆమెపై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ ముంబైలోని బ్రిటిష్‌ రాయబార కార్యాలయంలో గత కొన్నేళ్లుగా పనిచేస్తోంది. మంగళవారం తన భర్త, మరికొంతమంది స్నేహితులతో కలసి ఆమె బాంద్రాలోని ఓ క్లబ్‌ కు వచ్చింది.

అయితే సదరు మహిళ రాత్రి 11.30 గంటల సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లగా.. ఆమెను వెంబడించి 35 ఏళ్ల యువకుడు ఆమెను అత్యాచారం చేశాడు. వెంటనే బయటకొచ్చి జరిగిన విషయం తన భర్తకు, స్నేహితులకు చెప్పగా వారు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు నగరానికి చెందిన ఘనశ్యామ్‌ లాలాచంద్‌ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. లాల్‌ చంద్‌పై ఐపీసీ సెక్షన్లు 354, 354 (ఎ), 509 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version