దాదాపు 13 లక్షల మంది భారతీయులను వందే భారత్ మిషన్ కింద వివిధ మార్గాల ద్వారా స్వదేశానికి వచ్చారని కేంద్రం ప్రకటన చేసింది. ఎయిర్ ఇండియా, ప్రైవేట్ మరియు విదేశీ క్యారియర్లు, చార్టర్డ్ విమానాలు, నావికా నౌకలు మరియు ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్ ల ద్వారా 13 లక్షల మంది వచ్చారని పేర్కొంది. గురువారం మధ్యాహ్నం మీడియాకు ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు.
ఈ నెల 1 వ తేదీ నుంచి ఆరవ దశ మిషన్ మొదలు పెడుతున్నామని అయన అన్నారు. ఈ దశలో, 24 దేశాల నుండి ఒక వెయ్యి, ఏడు అంతర్జాతీయ విమానాలు ఈ నెలలో నడపవలసి ఉందని ఆయన చెప్పారు. వాటి ద్వారా దాదాపు రెండు లక్షల మందికి పైగా స్వదేశానికి వస్తారని ఆయన వివరించారు.