వర్క్ ఫ్రం హోం శాశ్వతంగా…!

-

లాక్ డౌన్ లో ఇప్పుడు అందరూ ఇంటి నుంచే ఉద్యోగం చేస్తున్నారు. అన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం ని ప్రకటించాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంపెనీలు ఇప్పుడు ఉద్యోగులను ఇంటి నుంచి ఉద్యోగాలు చెయ్యాలని సూచిస్తున్నాయి. ఈ తరుణంలో జర్మని ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక కోరుకున్న ఉద్యోగులను ఇంటి నుంచే ఉద్యోగం చెయ్యాలని ఒక బిల్ ని ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉంది.

ప్రస్తుతం జర్మనీలో 25 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. 12 శాతం మంది ఆఫీసులకు వెళ్లి పని చేస్తున్నారు. మిగతా వారు ఏమీ లేకుండా సెలవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. వారానికి రెండు, మూడు రోజులు లేదా శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేసే వెసలుబాటును ఉద్యోగులందరికి కల్పించే బిల్లును ఈ ఏడాదే పార్లమెంట్‌కు సమర్పిస్తానని కార్మిక మంత్రి హుబర్టస్‌ ఒక ప్రకటన విడుదల చేసారు.

దీనికి దేశ ఆర్థిక మంత్రి ఓలాఫ్‌ స్కోల్జా మద్దతు తెలపడం గమనార్హం. కంపెనీ యజమాని అనుమతించినప్పుడే ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే హక్కు లభిస్తుందని ఆయన ఒక మెలిక పెట్టారు. మన దేశంలో కూడా పలు కంపెనీలు ఇప్పుడు లాక్ డౌన్ ని ఎక్కువ కాలం ఉంటే మాత్రం వర్క్ ఫ్రం హోం ని కొనసాగించాలి అని భావిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news