వర్క్ ఫ్రమ్ జైల్ ఇప్పుడే వింటున్న… ఢిల్లీ సీఎంపై రాజ్ నాథ్ సింగ్ సెటైర్స్

-

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని ఉద్దేశిస్తూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఫతేఘర్ సాహిబ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గెజ్జా రామ్ వాల్మీకి కోసం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఇక్కడ ఆప్ అధికార పార్టీ, అది ఎలాంటి పని చేస్తుందో మీకు పెద్దగా చెప్పనవసరం లేదని చెప్పారు. ఢిల్లీలో కూడా ఇదే పార్టీ ప్రభుత్వం ఉందని, కానీ మద్యం కుంభకోణంలో ఒక నాయకుడు జైలు పాలయ్యాడని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురించి మాట్లాడారు.

ఒక వ్యక్తిపై ఏవైనా ఆరోపణలు వస్తే తన పదవికి రాజీనామా చేసే నైతిక ధైర్యం, ప్రతీ నాయకుడికి ఉండాలని అన్నారు.మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలు పాలయ్యాడని, అక్కడి నుంచే ముఖ్యమంత్రి పదవిని కొనసాగిస్తానని చెప్పాడని తెలిపారు. మనందరికి వర్క్ ఫ్రం ఆఫీస్, వర్క్ ఫ్రం హోమ్ గురించి తెలుసని, కానీ తొలిసారి ”వర్క్ ఫ్రమ్ జైల్” గురించి వింటున్నానని రాజ్ నాథ్ సింగ్ సెటైర్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version