హైదరాబాద్‌లో పొడవైన సోలార్‌ బై సైకిల్‌ ట్రాక్‌.. రేపు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్

-

హైదరాబాద్ మహానగరం సిగలో మరో కలికితురాయి చేరబోతోంది. నగరవాసుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు ఇప్పటికే మెట్రో, ఆర్ఓబీ, ఫ్లై ఓవర్లు వచ్చాయి. ఈ జాబితాలో ఇప్పుడు వరల్డ్ క్లాస్ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మాణానికి సర్కార్ శ్రీకారం చుట్టబోతోంది. రేపు ఔటర్ రింగ్ రోడ్డు వెంట నిర్మించనున్న వరల్డ్ క్లాస్ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.

ఓఆర్ఆర్ వెంట తొలి విడతగా 23 కిలో మీటర్ల మేర 4.5 మీటర్ల వెడల్పుతో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మించనున్నారు. మొదటి దశ కింద ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి నానక్ రామ్‌గూడ నుంచి కొల్లూరు వరకు సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణం చేస్తారు. ఈ సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌ నుంచి 16మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు.

సైకిల్‌పై సవారీ చేయలకునే వారి కల 2023 వేసవి నాటికి తీరుతుందని మంత్రి కేటీఆర్ హామీ ఇస్తున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్‌ కూడా చేశారు. ట్రాక్‌ వెంట భద్రత కోసం 24/7 పనిచేసే సీసీటీవీలను కూడా అమర్చనున్నారు. ఈ సీసీటీవీలను కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేసి భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఐటీ నిపుణులను దృష్టి ఉంచుకుని తొలి దశ నిర్మాణాన్ని చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version