వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. చాలా మంది ఇళ్లల్లో వాస్తుని అనుసరిస్తూ ఉంటారు. నిజానికి వాస్తుని అనుసరించడం వల్ల ఎంతో మంచి కలుగుతుంది. సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి.
చాలా మంది వాస్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏం తప్పు ఏది ఒప్పు అని తెలుసుకుంటూ ఉంటారు. అయితే నిజానికి వాస్తు పండితులు చెప్పిన ఈ అద్భుతమైన చిట్కాలు ఫాలో అయితే కచ్చితంగా సమస్యల నుండి బయటపడవచ్చు. కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండడానికి అవుతుంది.
బాత్రూం లో పాటించాల్సిన వాస్తు చిట్కాలు:
బాత్రూం లో ఎటువంటి వాస్తు చిట్కాలు పాటించాలి అని చూస్తే.. ఎప్పుడూ కూడా ఖాళీ బకెట్ ని బాత్రూంలో ఉంచకూడదు. ఖాళీ బకెట్లుని పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. నీలం రంగు బకెట్ ని నీళ్లతో నింపితే లక్ష్మీదేవి వస్తుంది. నీలం రంగు ఆనందానికి చిహ్నం. బాత్రూంలో నీలం రంగు టైల్స్ వేయించుకుంటే కూడా మంచిది.
వంటిట్లో పాటించాల్సిన వాస్తు చిట్కాలు:
వంటింటికి ఆరెంజ్, పసుపు, ఆకుపచ్చ రంగులు వేయించుకుంటే మంచిది.
బ్రౌన్, బ్లాక్ వంటి రంగులు వేయించుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విధంగా ఉంచితే సమస్యలు రావు.
పూజ గదిలో పాటించాల్సిన వాస్తు చిట్కాలు:
చాలామంది బెడ్ రూంలో ఒక మూలన దేవుడిని పెట్టి పూజిస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గుతుంది. అలానే చనిపోయిన వాళ్ళ ఫోటోలు దేవుడి గదిలో ఉంచకూడదు ఇలా ఈ జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు ఉండవు.