ఈ రోజు వన్ డే వరల్డ్ కప్ లో భాగంగా డబుల్ హెడర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ డబుల్ హెడర్ లో భాగంగా ఉదయం మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ ను ఢీకొనింది. టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకిబుల్ హాసన్ ఛేజింగ్ కు మొగ్గు చూపడం కలిసి వచ్చింది అని చెప్పాలి. వరల్డ్ కప్ లో అంతగా అనుభవం లేని ఆఫ్ఘన్ జట్టు కేవలం 156 పరుగులకే కుప్పకూలిపోయింది. వార్మ్ అప్ మ్యాచ్ లో చూపించిన దూకుడు మెయిన్ మ్యాచ్ లో చూపించడంలో ఆఫ్గనిస్తాన్ దారుణంగా విఫలం అయింది. ఆఫ్ఘన్ ప్లేయర్ లలో ఓపెనర్ గర్భాజ్ ఒక్కడే 47 పరుగులు చేశాడు.. ఇక ఆఫ్ఘన్ ను తక్కువ స్కోర్ కె కట్టడి చేయడంలో షకీబ్ 3, మెహిదీ హాసన్ మిరాజ్ 3 మరియు షారిఫుల్ ఇస్లాం 2 లు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర వహించారు.
అనంతరం 157 పరుగుల లక్ష్యాన్ని బాంగ్లాదేశ్ నాలుగు వికెట్లు కోల్పోయి మరో ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించి వరల్డ్ కప్ ను ఘనంగా ఆరంభించింది. బ్యాటింగ్ లోనూ రాణించిన మెహిదీ హాసన్ (57) కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.