కోల్కతా వేదికగా బంగ్లాదేశ్ మరియు నెదర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఎడ్వర్డ్స్ సేన నిర్ణీత ఓవర్లలో సరిగ్గా 229 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీం ను బారేసి మరియు యాకర్ మాన్ లు ఆదుకునే ప్రయత్నం చేసినా 63 పరుగులకే కోల్పోయిన దశలో మరోసారి కెప్టెన్ ఎడ్వర్డ్స్ డి లీడ్ తో కలిసి 43 పరుగులు జోడించారు.. ఆ తర్వాత మళ్ళీ ఎంగెల్ బ్రేక్ తో కలిసి ఆరవ వికెట్ కు 78 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో నెదర్లాండ్ 229 పరుగులకు సరిపెట్టుకుంది. ఎడ్వర్డ్స్ (68) అర్ద సెంచరీ చేయగా , బారేసి (41) మరియు సైబ్రాండ్ (35) లు తగిన సహకారం అందించారు.
ఇప్పటి వరకు నెదర్లాండ్ వరల్డ్ కప్ లో సాధించిన పెద్ద విజయం ఏదైనా ఉంది అంటే.. అది సౌత్ ఆఫ్రికా ను ఓడించడమే, ఇప్పుడు బంగ్లాదేశ్ ను కూడా ఓడించి షాక్ ఇస్తుందా చూడాలి.