కాసేపటి క్రితమే వరల్డ్ కప్ లో జరుగుతున్న మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న కివీస్ ఇంగ్లాండ్ ను తక్కువ స్కోర్ కె కట్టడి చేసి సక్సెస్ అయింది. ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్ లలో కేవలం పరుగులకు మాత్రమే పరిమితం అయింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో కేవలం రూట్ ఒక్కడే 77 పరుగులు చేసి జట్టు స్కోర్ లో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా నిలిచాడు. ఇక బట్లర్ ఒక్కడే రూట్ తర్వాత ఎంతో కొంత జట్టుకు అవసరం అయిన పరుగులు చేశాడు.. ఇక వరుసగా బెయిర్ స్టో, మలన్, బ్రూక్, మొయిన్ అలీ, లివింగ్ స్టెన్ లు మూకుమ్మడిగా ఫెయిల్ అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ 3, మిచెల్ 2, ఫిలిప్స్ 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను కట్టడి చేశారు. మరి విలియమ్సన్ లేని న్యూజిలాండ్ జట్టు ఈ స్కోర్ ను ఛేదిస్తుందా లేదా అన్నది చూడాలి.
ఇక వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ ఈ విధంగా ఆడడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంగ్లాండ్ లాంటి టాప్ టీం ఈ విధంగా ఆడడం ఏమిటంటూ కామెంట్స్ చేస్తున్నారు.