వరల్డ్ కప్ లో ఈ రోజు నామమాత్రం అయిన మ్యాచ్ లో పూణే వేదికగా ఇంగ్లాండ్ మరియు నెదర్లాండ్ లు ఆడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక జట్టులో కూడా రెండు కీలక మార్పులు చేసింది ఇంగ్లాండ్ యాజమాన్యం. లివింగ్ స్టన్ మరియు మార్క్ వుడ్ ల స్థానంలో హరీ బ్రూక్ మరియు అట్కిన్ సన్ లను తీసుకుంది. ఇంగ్లాండ్ కు ఈ వరల్డ్ కప్ లో ఉన్న రెండు మ్యాచ్ లలో గెలిస్తేనే 2025 లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో స్థానం లభిస్తుంది, లేదంటే బయట ఉండాల్సిందే. మరి నెదర్లాండ్ లాంటి జట్టుపైన ఎంతటి విజయాన్ని సాధిస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఇక నెదర్లాండ్ కూడా జట్టులో జుల్ఫీకర్ కు బదులుగా తేజ నిడమానూరు ను తీసుకుంది.
నెదర్లాండ్ కూడ ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉన్నందున రెండింటిలోనూ విజయం సాధించాలన్న కసితోనే ఉంది. ఇంగ్లాండ్ తమ కాసిని అంతా ఈ రెండు మ్యాచ్ లలో చూపిస్తుందా చూడాలి.