వరల్డ్ కప్ లో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ తో కలుపుకుని మూడు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా ఇండియా బ్యాటింగ్ చేస్తుండగా కివీస్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ పరుగులు నియంత్రిస్తుంది. రోహిత్ శర్మ మొదటి వికెట్ గా వెనుతిరిగినా ఆ తర్వాత శుబ్మాన్ గిల్ వేగం పెంచి ఆడుతున్నాడు. కాగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో నాలుగు సిక్సులు మరియు నాలుగు ఫోర్లు ఉన్నాయి. కాగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఒక రికార్డును నెలకొల్పాడు. గతంలో వెస్ట్ ఇండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్నవరల్డ్ కప్ లో అత్యధిక సిక్సులు (49) రికార్డును రోహిత్ 50 సిక్సులు సాధించి అధిగమించాడు. కానీ గేల్ 34 ఇన్నింగ్స్ లో ఈ ఘనతను సాధించగా, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మాత్రం కేవలం 27 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను అందుకుని తనకు తిరుగులేదని నిరూపించారు.
కాగా ఈ వరల్డ్ కప్ లో ఇండియాను ఓటమై ఎరుగని జట్టుగా వరుస విజయాలు అందించి టైటిల్ వైపు తీసుకువెళ్తున్నాడు.