వరల్డ్ కప్ 2023: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అర్ద సెంచరీ చేశాక అవుట్ !

-

ఈ రోజు వరల్డ్ కప్ షెడ్యూల్ లో భాగంగా పాకిస్తాన్ మరియు సౌత్ ఆఫ్రికా లు తలపడుతున్నాయి. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ పాకిస్తాన్ తడబడుతూ ఆడుతోంది, ఇప్పటికే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి మరోసారి ఓటమి ప్రమాదంలో పడింది. ఒకవైపు వికెర్ట్లు పడుతున్నా కెప్టెన్ బాబర్ ఆజామ్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ జట్టుకు మంచి స్కోర్ ను అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దశలో బాబర్ ఆజామ్ అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఏమి లాభం అర్ద సెంచరీ పూర్తి చేసిన వెంటనే షంషీ బౌలింగ్ లో కీపర్ డికాక్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించాల్సిన కెప్టెన్ అవుట్ అవడంతో పాకిస్తాన్ తీవ్ర ప్రమాదంలో పడింది.

మరి ఇప్పుడు జట్టు ఎంత స్కోర్ చేస్తుందన్నది ప్రశ్నఅర్ధకంగా మారింది. ప్రస్తుతం క్రీజులో షకీల్ మరియు ఖాన్ లు ఉన్నారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో జాన్సన్ రెండు మరియు శంసి రెండు వికెట్లు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version