వరల్డ్ కప్ లో మూడు సెమిస్ స్థానాలు ఖరారు అయిన విషయం తెలిసిందే. ఇండియా, సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా లు వరుసగా మొదటి నుండి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇప్పుడు నాలుగవ స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. అందులో న్యూజిలాండ్, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లు ఉన్నాయి. కాగా ఈ రోజు శ్రీలంక తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ భారీ విజయం దిశగా దూసుకువెళుతోంది. ఇక ఎలాగు న్యూజిలాండ్ విజయం ఖరారు అయింది. ఇప్పుడు తరువాత పాకిస్తాన్ కు సెమీస్ కు వెళ్ళడానికి అవకాశాలు ఉండడంతో ఇప్పుడు న్యూజిలాండ్ సాధించి రన్ రేట్ కు మించి సాధిస్తే సెమీస్ కు వెళుతుంది. అందులోనూ పాకిస్తాన్ తన తర్వాత మ్యాచ్ ను ఇంగ్లాండ్ తో ఆడనుండడం కూడా కష్టమే అని చెప్పాలి.
ఇంగ్లాండ్ ఆఖర్లో పాకిస్తాన్ కు ఝలక్ ఇస్తే అంతే సంగతులు. మరి పాకిస్తాన్ ఇంగ్లాండ్ పై గెలవడంతో పాటుగా, కివీస్ కన్నా అధిక రన్ రేట్ ను సాధించాల్సి ఉంది.