SEMIFINAL 1:ఇండియాతో తలపడనున్న న్యూజిలాండ్ ?

-

కాసేపటి క్రితం ముగిసిన శ్రీలంక మరియు న్యూజిలాండ్ మ్యాచ్ లో విలియమ్సన్ సేన అయిదు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ముందుగా టాస్ గెలిచి ఛేజింగ్ ఎంచుకున్న కివీస్ ముందు శ్రీలంక పేలవంగా ఆడి కేవలం 172 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఈ లక్ష్యాన్ని న్యూజిలాండ్ అయిదు వికెట్లు కోల్పోయి 23 .2 ఓవర్లలో ఛేదించి గెలిచింది. ఈ విజయంతో న్యూజిలాండ్ తొమ్మిది మ్యాచ్ లలో అయిదు గెలిచి పాయింట్ 10 లతో పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో నిలిచింది, ఇక రన్ రేట్ లోనూ + 0.922 కు చేరుకుంది. ఈ రన్ రేట్ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ల కన్నా మెరుగ్గా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ తన తర్వాత మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై భారీ తేడాతో గెలిచిన ఈ రన్ రేట్ ను సాధిస్తుందా అంటే సందేహమే అని చెప్పాలి.

దీనిని బట్టి సెమిఫైనల్ 1 లో ఇండియా తో తలపడే జట్టు న్యూజిలాండ్ అని అంతా ఫిక్స్ అయిపోతున్నారు. మరి ఏమైనా అద్భుతం జరిగితే ఏమో చెప్పలేము.

Read more RELATED
Recommended to you

Exit mobile version