విక్రమ్ స్టైల్.. గౌతమ్ మీనన్ టేకింగ్.. వేరే లెవెల్ అంతే

-

వర్సెటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ధృవ నక్షత్రం. రీతూవర్మ హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించాడు. పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే తమిళ ట్రైలర్ నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. తాజా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ముంబై దాడులు జరిగినప్పుడు అక్కడికి ఎన్‌ఎస్‌జీ హెలికాప్టర్‌ రావడం బాగా ఆలస్యమైంది.. అంటూ సాగే డైలాగ్స్‌తో మొదలైంది ట్రైలర్‌.

Dhruva Nakshatram trailer promises an action-packed entertainer |  123telugu.com

అతి ముఖ్యమైన మిషన్‌ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు గౌతమ్‌ మీనన్‌. ఈ మూవీలో ఐశ్వర్యారాజేశ్‌, సిమ్రాన్‌, రాధికా ఇతర నటీనటులు కీ రోల్స్‌ పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ మూవీని ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొండదువోం ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్కేప్‌ ఆర్టిస్ట్స్‌ మోషన్స్ పిక్చర్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తుండగా యువ సంగీత దర్శకుడు హరీష్‌ జైరాజ్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. యాక్షన్‌ స్పై జోనర్‌లో వస్తున్న ఈ మూవీలో విక్రమ్‌ జాన్/ధ్రువ్‌ పాత్రల్లో కనిపించబోతున్నాడు‌. ఈ చిత్రం నుంచి ఇటీవలే కరిచేకళ్లే చూసి లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారని తెలిసిందే. ధ్రువ నక్షత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా సందడి చేయనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version