ఈ రోజు వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పుడే పూర్తి అయిన పాకిస్తాన్ మరియు శ్రీలంక మ్యాచ్ లో బాబర్ అజామ్ సేన 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. శ్రీలంక నిర్దేశించిన 345 పరుగుల లక్ష్యాన్ని పాక్ చేదిస్తుందని ఎవ్వరూ అనుకుని ఉండరు. ఎందుకంటే పాకిస్తాన్ స్టార్టింగ్ లోనే 2 కీలక వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కింది. కానీ కీపర్ రీజ్వాన్ మరియు అబ్దుల్లా షఫిక్ లు ఎక్కడా తడబడకుండా, చాలా దైర్యంగా శ్రీలంక బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని టీమ్ ను సక్సెస్ ఫుల్ గా గెలిపించారు. రిజ్వాన్ (131*) మరియు షఫిక్ (113) సెంచరీ లతో చెలరేగి మూడవ వికెట్ కు 176 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఒకవైపు వీరిద్దరూ చెలరేగి ఆడుతుంటే శ్రీలంక వద్ద నుండి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. అందుకే కష్ట సాధ్యమయిన లక్ష్యాన్ని కూడా పాకిస్తాన్ చేదించింది.
కాగా ఈ టార్గెట్ చేదించడం వరల్డ్ కప్ చరిత్రలో ఇది మూడవ సారి కావడం ఒక రికార్డ్ అయితే… అత్యధిక వరల్డ్ కప్ టార్గెట్ ఇదే కావడం విశేషం. 2011 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై ఐర్లాండ్ 328 పరుగులు అత్యధికంగా… కాగా ఈ రోజుతో ఈ రికార్డుకు తెరపడింది. చరిత్రలో నిలిచిపోయే విధంగా పాకిస్తాన్ అదరగొట్టింది.