నేడు బెంగుళూరు వేదికగా పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో ఇరు జట్లకు చావో రేవో లాంటి పరిస్థితి అని చెప్పాలి. గెలిస్తేనే ముందుకు వెలుతాయి అన్న తరుణంలో కీలక మ్యాచ్ ఆడుతుండగా వరుణుడు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. పాకిస్తాన్ 402 పరుగుల భారీ టార్గెట్ ను చేజ్ చేస్తున్న సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ ను నిలిపివేయడం జరిగింది. కాగా అంతకు ముందు కివీస్ బ్యాటింగ్ లో పాక్ బౌలర్లను చీల్చి చెండాడింది. రచిన్ రవీంద్ర సెంచరీ చేయగా, కెప్టెన్ కేన్ విలియమ్సన్ పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే ఈ ఇన్నింగ్స్ తర్వాత విలియమ్సన్ ఒక రికార్డును అందుకున్నాడు. న్యూజిలాండ్ తరపున వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. విలియమ్సన్ వరల్డ్ కప్ లలో 1084 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఇక ఇతని కన్నా ముందు స్టీఫెన్ ఫ్లెమింగ్ 1075 పరుగులు మరియు రాస్ టేలర్ 1002 పరుగులతో ఆ తర్వాత స్థానాలలో ఉన్నారు. న్యూజిలాండ్ దిగ్గజాలను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకున్నాడు.