“ఎన్టీఆర్” అంటే ఇంత పిచ్చా…ఇతను ఏమి చేశాడో మీరే చూడండి!

-

మాములుగా సినిమా నటులు అన్నా లేదా ప్రజలకు సేవ చేసే మంచి రాజకీయ నాయకులు అన్నా ప్రజలు గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తారు, ప్రాణం కన్నా ఎక్కువగా ఆరాధిస్తారు. మరీ ముఖ్యంగా సినిమా నటులకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలుగు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు ఒక రేంజ్ లో తన అభిమానాన్ని చాటుకుని తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారాడు. ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాకు చెందిన ఒక అభిమాని సొంతంగా ఇళ్లు కట్టుకోవాలని సంకల్పించాడు.. ఇక ఇల్లు నిర్మించాలంటే ఇటుకలు తీసుకోవడం తప్పనిసరి. అయితే ఈ అభిమాని తన ఇంటికి వాడే ప్రతి ఇటుకపైన కూడా NTR అని అచ్చు వేయించుకున్నాడు. ఎన్టీఆర్ అన్న పేరుతో తన ఇంటిని నిర్మించుకుంటున్నాడు ఆ అభిమాని.
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ విషయం ఎన్టీఆర్ దగ్గరకు వెళుతుందా ? చూసిన తర్వాత ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version