ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన దాని ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన నగరం మదీనా. సౌదీ అరేబియాలోని మదీనా నగరాన్ని సందర్శించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ఆరోగ్యకరమైన అన్ని స్టాండర్డ్స్ కి మదీనా నగరం సరిగ్గా సరిపోయిందని అందుకే ఆ నగరాన్ని ప్రపంచ ఆరోగ్యకరమైన నగరంగా ప్రకటించామని తెలిపింది. ఐతే ఈ నగరాన్ని ఆరోగ్యకరంగా మార్చేందుకు 22ప్రభుత్వ, కమ్యూనిటీ సంస్థలు పనిచేసాయని, మొత్త 20లక్షలకి పైగా జనాభా గల మదీనా నగరాన్ని ఆరోగ్యకరంగా చేసాయని వివరించింది.
మదీనా ప్రభుత్వ అధికారులు తైబా విశ్వవిద్యాలయం తో కూడి ప్రపంచ ఆరోగ్య సంస్థకి కావాల్సిన రిపోర్టులు అందజేసారు. ఐతే మదీనా నగరాన్ని మరింత అందంగా, ఆరోగ్యకరంగా మార్చాలని, అందుకు నేషనల్ ఏజేన్సీస్ ని అందులో భాగం చేసుకోవాలనీ, తైబా విశ్వ విద్యాలయం వారికి వెల్లడించింది. నగర ప్రజలకి మద్దతు అందిస్తూ తమ సేవలని మరింత విస్తరిస్తూ ప్రపంచంలో ఆరోగ్యకర నగరంగా నిలిచిందని ప్రపంచ వాణిజ్య సంస్థ తెలిపింది.