గుజరాత్‌లోని నర్మదా నది మధ్యలో నిర్మించిన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ విగ్రహం ఎత్తు 182 మీటర్లు. అయితే ఇప్పుడు ఈ విగ్రహం రికార్డు బద్దలు కొట్టడానికి అయోధ్యలో రామయ్య ప్రతిమ రెడీ అవుతోంది. 251 మీటర్ల రాముడి ప్రతిమను అయోధ్యలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఇదే కానుంది.
రామజన్మభూమిలో కొత్తగా నిర్మితమవుతున్న రామాలయం దర్శనానికి వచ్చే వారిని మంత్రముగ్ధుల్ని చేసేందుకు పద్మభూషణ్ గ్రహీత రామ్.వి.సుతార్ అనే శిల్పి ఈ విగ్రహ రూపకల్పనకు సారథ్యం వహించనున్నారు. గుజరాత్ కేవడియాలోని సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని ఈయనే రూపొందించారు.
అయోధ్యలో ఏర్పాటు కానున్న రాముడి విగ్రహం 251 మీటర్లు ఎత్తు ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా ఉన్న పటేల్ ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ'(182 మీటర్లు) కన్నా ఇది 69 మీటర్లు పెద్దది.