మనం రోజూ తినే 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాలు ఇవే

-

ప్రతి రోజూ మనం మనకు తెలియకుండానే విషపదార్ధాలను తినేస్తున్నాం.. అవును నిజమే.. ఆ విషపదార్థాలేంటో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. తెల్లగా ఉంటేనే శుభ్రంగా ఉన్నట్టు ఫీలవుతూ ఉంటాం. అయితే మనం తినే తెల్లని విషపదార్థాలేంటంటే..

  • రీఫైన్డ్ బియ్యం
  • పాశ్చ‌రైజ్డ్ పాలు
  • రీఫైన్డ్ పంచదార
  • రీఫైన్డ్ పిండి
  • రీఫైన్డ్ ఉప్పు

ఫైన్డ్ బియ్యం (మెరుగుపెట్టిన బియ్యం)

బియ్యం తెల్లగా మల్లెపువ్వులా మిల మిలా మెరిసేటా రీఫైన్‌ చేస్తారు. ఈ రీఫైన్‌ చేసే క్రమంలో బియ్యంలో ఉండే ఫైబర్‌ మరియు పోషకాలు తీసివేయబడతాయి. ఇలా రీఫైన్‌ చేసిన బియ్యాన్ని తినడం వల్ల మంచి జరగకపోగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికం. ముఖ్యంగా డయాబెటిస్‌.

పాశ్చ‌రైజ్డ్ పాలు

పాలు ఆరోగ్యానికి హానికరం..? ఇప్పుడు ఇలాంటి స్టేమెంట్‌ ఇవ్వాల్సి వస్తోంది మరి. ఎందుకంటే పాశ్చరైజేషన్‌ పేరుతో పాలను బలహీన పరుస్తున్నారు. పాలను పాశ్చ‌రైజ్ చేసే క్ర‌మంలో అందులో ఉండే కీల‌క విట‌మిన్లు, ఎంజైమ్‌లు నాశ‌న‌మ‌వుతాయి, పాల నుండి ఎంజైములు, విటమిన్ A, B12 మరియు C లను తొలగిపోతాయి. ఈ ప్రక్రియ కోసం పాలలో రసాయనాలు కలుపుతారు, ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇలా పాశ్చరైజేషన్ చేయబడ్డ పాలలో కేవలం 10 శాతం పోషకాలు మాత్రమే మిగులుతాయి. ఈ పాలలో కలిపిన రసాయనాల వల్ల ఆ పాల‌ను సేవిస్తే మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అసిడిటీ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

రీఫైన్డ్ పంచదార

వెనకటి కాలంలో చెరకుగడల రసాన్ని మరగించి, దానిని చల్లబరచి పంచదారను తయారు చేసేవారు. . చక్కెరని చెరుకు రసం నుండి నేరుగా తీసుకుని, శుద్ధిచేయని ముడి రూపంలో వాడేవారు. వడగట్టిన రసాన్ని గడ్డకట్టేంత వరకూ కాచి, దాన్ని రాళ్ళుగా విడగొట్టి చక్కెరగా స్వీకరించేవారు. ఈ రోజులల్లో చక్కెర చాలావరకూ రసాయన ప్రక్రియలకు గురైనది, శుద్ధి చేయబడింది. ఈ రీఫైన్ చేసే క్ర‌మంలో అందులో ఉండే 90 శాతం పోష‌క విలువలు నాశ‌న‌మ‌వుతాయ‌ట‌. దీనికి తోడు అలాంటి చ‌క్కెర‌లో కార్బ‌న్ డ‌యాక్సైడ్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. దంత క్షయం, మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు అధికం.

చెక్కర కు ప్రత్యామ్న్యాయంగా బెల్లం ,తేనె లను వాడటం మంచిది.

రీఫైన్డ్ పిండి

శుద్ధిచేసిన తెల్లపిండిలో(మైదా) బాగా పాలీషు పట్టించిన తెల్లని బియ్యంలోనుంచి పోషక పదార్ధాలు , పీచు తొలగింపబడతాయి.శుద్ధిచేయని గింజధాన్యాలలో విటమిన్లు , ఖనిజ లవణాలు మరియు అధికంగా పీచు ఉండడంవల్ల జీర్ణక్రియ బాగా జరగడానికి తోడ్పడుతుంది.రీఫైన్ చేయ‌బ‌డిన గోధుమ పిండి లేదా మైదా పిండిలో అల్లోగ్జాన్ అన‌బ‌డే ప్రమాద‌క‌ర ర‌సాయ‌నం క‌లుస్తుంద‌ట‌. ఇది క్లోమంలో ఉండే క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంద‌ట‌. దీంతో డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌.

రీఫైన్డ్ ఉప్పు

మనం వాడే ఉప్పు ని టేబుల్ సాల్ట్ అంటారు. అధిక ఉష్ణోగ్రత వద్ద టేబుల్ సాల్ట్ ని తయారు చేస్తారు. ఇది నీటిలో పూర్తిగా కరగదు. టేబుల్ సాల్ట్ లో సహజసిద్ధమైన సోడియం లోపించడం వల్ల బ్రాంకియల్, లంగ్స్ సమస్యలు ఏర్పడతాయి.
రీఫైన్ చేసిన ఉప్పును తింటే గుండె సంబంధ వ్యాధులు వ‌స్తాయి. బీపీ ఎక్కువ‌వుతుంది. ప్ర‌మాద‌క‌ర కెమిక‌ల్స్ మ‌న శ‌రీరంలోకి వెళ్లి అనారోగ్యాల‌ను తెచ్చి పెడ‌తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version