ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఇప్పటికే పౌరులు అత్యధిక స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలను పొందుతున్నారు. కానీ మన దేశంలో ఇంకా చాలా చోట్ల అసలు ఇంటర్నెట్ అందుబాటులో లేదు. కొన్ని చోట్ల అందుబాటులో ఉన్నా స్పీడ్ చాలా తక్కువగా వస్తోంది. దేశవ్యాప్తంగా సగటున ఒక పౌరుడికి అందుతున్న ఇంటర్నెట్ స్పీడ్ 6.5 ఎంబీపీఎస్‌గా ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తున్న దేశాల వివరాలు ఇలా ఉన్నాయి.
1. ప్రపంచంలోనే అత్యధిక ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తున్న దేశంగా తైవాన్ పేరుగాంచింది. ఇక్కడ ఒక పౌరుడికి సగటున 85.02 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్ అందుతోంది. అంటే.. 5జీబీ సైజ్ ఉండే మూవీ కేవలం 8 నిమిషాల 2 సెకన్లలోనే డౌన్‌లోడ్ అవుతుందన్నమాట.
2. సింగపూర్‌లో పౌరులు సగటున 70.86 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్‌ను పొందుతున్నారు. ఒక్క మూవీని డౌన్‌లోడ్ చేసేందుకు సుమారుగా 9 నిమిషాల 38 సెకన్లు పడుతుంది.
3. స్వీడన్ పౌరులు యావరేజ్‌గా 55.18 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఒక మూవీ ఇక్కడ డౌన్ లోడ్ అయ్యేందుకు సుమారుగా 12 నిమిషాల 22 సెకన్లు పడుతుంది.
4. డెన్మార్క్‌లో యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ 49.19 ఎంబీపీఎస్‌గా ఉంది. 5జీబీ సైజ్ మూవీ డౌన్‌లోడ్‌కు 13 నిమిషాల 53 సెకన్లు పడుతుంది.
5. జపాన్‌లో సగటు పౌరుడు వాడుకుంటున్న ఇంటర్నెట్ స్పీడ్ 42.77 ఎంబీపీఎస్‌గా ఉంది. 5జీబీ మూవీ డౌన్‌లోడ్‌కు 15 నిమిషాల 58 సెకన్ల సమయం పడుతుంది.
6. లగ్జెంబర్గ్‌లో ఇంటర్నెట్ సగటు స్పీడ్ 41.69 ఎంబీపీఎస్‌గా ఉంది. 5జీబీ మూవీ డౌన్‌లోడ్‌కు 16 నిమిషాల 23 సెకన్లు పడుతుంది.
7. నెదర్లాండ్స్ లో యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ 40.21 ఎంబీపీఎస్‌గా ఉంది. 5జీబీ మూవీ డౌన్‌లోడ్ కు పట్టే సమయం 16 నిమిషాల 59 సెకన్లు.
8. స్విట్జర్లాండ్‌లో 38.85 ఎంబీపీఎస్ యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. మూవీ డౌన్‌లోడ్‌కు 17 నిమిషాల 34 సెకన్ల సమయం పడుతుంది.
9. నార్వేలో 38.85 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ను వాడుకుంటున్నారు. 17 నిమిషాల 34 సెకన్ల సమయంలో మూవీని డౌన్‌లోడ్ చేయవచ్చు.
10. స్పెయిన్ లో యావరేజ్‌గా 36.06 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్ లభిస్తుంది. 5జీబీ వీడియోకు 18 నిమిషాల 56 సెకన్ల సమయం పడుతుంది.