వావ్; షెల్టర్ హోమ్స్ లోఉన్న వాళ్ళ కోసం థియేటర్ ఏర్పాటు చేసిన పోలీసులు…!

-

కరోనా వైరస్ లాక్ డౌన్ లో చాలా మంది ఇంట్లో ఉండి ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి సంగతి పక్కన పెడితే… ఇంట్లో ఇంట్లో ఉండి ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితిలో పిచ్చి ఎక్కుతుంది. మనకు అంటే ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఉన్నాయి. మరి ఏమీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి…? ఆశ్రమాల్లో, షెల్టర్ హోమ్స్ లో ఉండే వాళ్ళ పరిస్థితి చాలా వరకు నరకం అనే చెప్పాలి. అందుకే నాగపూర్ పోలీసులు కాస్త వినూత్నంగా ఆలోచించారు.

జనాలకు ఏ మాత్ర౦ బోర్ కొట్టకుండా ఉండటానికి గానూ ఒక చిన్న థియేటర్ ను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని నాగపూర్ పోలీసులు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఒక ఆశ్రయం గృహంలో ఏర్పాటు చేసిన ఓపెన్ థియేటర్ వీడియోను పోస్ట్ చేసారు. వీడియోలో, అజయ్ దేవ్‌గన్ మరియు కాజోల్ యొక్క తానాజీ చిత్రాన్ని చూపిస్తున్నట్టు ఉంటుంది. పేస్ మాస్క్ లు ధరించి చాలా మంది ఈ సినిమా చూసారు.

“ఒక సినిమా చూడటం ద్వారా మీద దృష్టి మల్లె అవకాశం ఉంటుంది. అలాగే ఆందోళన తగ్గించడానికి ఇది ఒక మంచి మార్గమని ట్విట్టర్ లో పేర్కొన్నారు. నాగపూర్ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు సమర్ధిస్తున్నారు. ఇది మంచి కార్యక్రమం అని పేర్కొన్నారు పలువురు. షెల్టర్ హోమ్స్ లో ఉన్న వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news