WTC : శ్రీ‌లంక‌పై క్లీన్ స్వీప్.. డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టికలో భార‌త్ దూకుడు

-

ఐసీసీ ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ 2021-23 కి సంబంధించి.. భార‌త్ ఒక స్థానం మెరుగు ప‌ర్చుకుంది. మంగ‌ళ‌వారం శ్రీ‌లంక పై టీమిండియా రెండో టెస్టు గెలిచి.. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. కాగ ఈ టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ తో ఐసీసీ ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ ఒక స్థానాన్ని మెరుగు ప‌ర్చుకుని నాలుగో స్థానంలో నిలిచింది.

కాగ ఈ పాయింట్ల పట్టిక‌లో ఆస్ట్రేలియా 77.77 శాతం తో మొద‌టి స్థానంలో ఉంది. అలాగే పాకిస్థాన్ 66.66 శాతంతో రెండో స్థానంలో ఉంది. సౌత్ ఆఫ్రికా 60 శాతంతో ముడో స్థానంలో ఉంది. అలాగే టీమిండియా 58.33 శాతంతో నాలుగో స్థానంలో ఉంది. కాగ ఐసీసీ ప్ర‌పంచ టెస్ట్ డిఫెండింగ్ ఛాంపియ‌న్ న్యూజిలాండ్ 38.88 శాతంతో ఆరో స్థానంలో ఉంది.

కాగ ఆస్ట్రేలియా యాషెస్ టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ ను 4-0 తేడాతో ఓడించి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో ఉంది. కాగ టీమిండియా వ‌రుస‌గా వెస్టిండీస్, శ్రీ‌లంక ల‌పై టెస్ట్ సిరీస్ ల‌ను క్లీన్ స్వీప్ చేసినా.. నాలుగో స్థానంలోనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version