WTC ఫైనల్ 2023 : ఫెయిల్ అయిన “హిట్ మ్యాన్” రోహిత్ శర్మ… ఓపెనర్లు ఇద్దరూ అవుట్ !

-

ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భాగంగా మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియన్ ను 469 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన ఇండియాకు ఆరంభం సరిగానే ఉన్నా ఆ స్టార్ట్ ను వాడుకోవడంలో ఓపెనర్లు ఫెయిల్ అయ్యారని చెప్పాలి.. మొదటగా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 15 పరుగులకే కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ లో అవుట్ కాగా, ఆ తర్వాత ఫామ్ లో ఉన్న శుబ్ మాన్ గిల్ సైతం బొలాండ్ బౌలింగ్ లో 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. కేవలం పది ఓవర్ లలోపే పట్టుమని 50 పరుగులు కూడా చేయకుండా అవుట్ అయ్యారు.

ఆస్ట్రేలియా చేసిన స్కోర్ కు ధీటుగా జవాబివ్వాల్సిన సమయంలో ఇలా ఓపెనర్లు ఇద్దరూ అవుట్ అవ్వడం ఇండియా అభిమానులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. మరి మిగతా ఆటగాళ్లు అయినా ఇండియాను ఆదుకుంటారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news