ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసారు తమిళనాడు పోలీసులు. జూన్ 22వ తేదీన తమిళనాడులోని మదురైలో నిర్వహించిన మురుగన్ భక్తుల కాన్ఫరెన్స్ మీటింగులో మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించారని పవన్ కళ్యాణ్, మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మదురై పీపుల్ ఫెడరేషన్ ఫర్ కమ్యునల్ హార్మొనీ సంస్థ.

కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారంటూ పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు అన్నానగర్ పోలీసులు.