వూహాన్ లో ఒకతను రెండు మైళ్ళు పరిగెడుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ కారణంగా ఊహన్ లో ఒకతను మాస్కు(mask) ధరించి పరిగెత్తాడు.
రెండు మైళ్ళు దాటిన తర్వాత అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ 26 ఏళ్లతను మాస్కు పెట్టుకొని పరిగెట్టడం వల్ల పడిపోవడంతో ఊహన్ సెంట్రల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయని ఊపిరితిత్తుల సమస్య వచ్చిందని సర్జరీ చేశారు డాక్టర్లు.
90% ఊపిరితిత్తులు కుదించబడింది అని అన్నారు. గుండె కుడివైపుకి కదులుతోంది అని చెప్పారు అయితే ఈ ఊపిరితిత్తుల సమస్యని pneumothorax అంటారు.
ఊపిరితిత్తుల కి మరియు చెస్ట్ వాల్ కి మధ్యలో గాలి లీక్ అవుతూ ఉంటుంది. దీని కారణంగా ఈ సమస్స్య వస్తుంది. అయితే మాస్కు ధరించి పరిగెట్టడం వల్లే ఇది జరిగిందని వైద్యులు గుర్తించారు.
ఇదిలా ఉంటే మరొక చోట ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఒకతను కుప్పకూలిపోయాడు. అది జరిగిన వారానికి జిమ్ లో మాస్క్ వేసుకుని జిమ్ చేస్తున్న మరొకతను కుప్పకూలి పోవడం జరిగింది.