చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వింత వ్యాధి.. ఏ క్షణమైన !

-

మన శత్రు దేశమైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు డ్రాగన్‌ మీడియా అఫిషియల్‌ గా ప్రకటించింది. మెదడుకి సంబంధించిన సెరిబ్రల్‌ అనూరిజం తో జిన్‌పింగ్‌ బాధపడుతున్నారని పేర్కొంది. ఈ వ్యాధి కారణంగానే గత సంవత్సరం ఆయన ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొంది. సెరిబ్రల్‌ అనూరిజం చాలా ప్రమాదకరమైందని వివరించింది.

వాస్తవానికి 2019 మార్చిలోనే జిన్‌ పింఘ్‌ కు ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు. ఆ సమయంలో ఐరోపా పర్యటనకు వెళ్లిన ఆయన ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఇటలీ, ఫ్రాన్స్‌ పర్యటనలో కూడా కూర్చోవడానికి చాలా ఇబ్బందికి పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైద్యుల సూచనలతో పలు రకాల పరీక్షలు చేయించు కోగా.. సెరిబ్రల్‌ అనూరిజంతో బాధపడుతున్న నిర్ణారణ అయింది. ఈ వ్యాధి కారణంగానే కరోనా వైరస్‌ విజృంభించినప్పటి నుంచి బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ వరకు కూడా జిన్‌పింగ్‌విదేశీ నేతలను ఎవరినీ కూడా కలవక పోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news