దేశంలో తాజ్ మహల్ కేంద్రంగా ఓ వివాదం నడుస్తోంది. తాజ్ మహల్ లో రహస్యంగా ఉన్న 22 గదులను తెరవాలని అలహాబాద్ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు అయింది. నేడు ఈ పిటిషన్ పై హైకోర్ట్ లో విచారణ జరగబోతోంది. ఈ పిటిషన్ ను బీజేపీ యూత్ మీడియా ఇంఛార్జ్ రజ్ నీష్ సింగ్ దాఖలు చేశారు. ఈ 22 గదుల్లో హిందు దేవతలకు సంబంధించి ఆనవాళ్లు ఉన్నాయని… నిజాలు తేల్చేలా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇవ్వాలని రజ్ నీస్ సింగ్ అలహాబాద్ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిలా ఉంటే చరిత్ర ప్రకారం మొగల్ రాజు షాజహాన్ తాజ్ మహల్ ను నిర్మించారని…తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్ మహల్ ను నిర్మించారని.. ప్రేమకు చిహ్నంగా దీన్ని భావిస్తుంటారు చరిత్రకారులు. ఇదిలా ఉంటే కొన్ని హిందూ వర్గాలు ఆరోపిస్తున్న ప్రకారం… తాజ్ మహల్ తేజో మహల్ అనే శివాలయం అని భావిస్తున్నారు. మొగల్ పాలకుల సమయంలో ఈ శివాలయాన్ని తాజ్ మహల్ గా మార్చారని ఆరోపిస్తున్నారు. దీని కారణంగానే తాజ్ మహల్ లోని 22 గదులు రహస్యంగా ఉన్నాయని వీటిని తెరిస్తే హిందూ దేవతల విగ్రహాలు, ఆనవాళ్లు కనిపిస్తాయని కొన్ని హిందు వర్గాలు చెబుతున్నాయి.