అదిరిపోయే ఫీచర్లతో షావోమీ నుంచి మరో కొత్త స్మార్ట్ టీవీ..

-

చవక ధరలో కాస్త మంచి టీవీ కొనాలంటే పేద, మధ్యతరగతి వాళ్లు చూసేది చైనా కంపెనీలవైపే. అందులో ముఖ్యంగా షావోమీ టీవీలు చవక ధరలతో పాటు ఎక్కువకాలం మన్నిక ఉంటుందని భావిస్తారు. షావోమీ బ్రాండ్ లవర్స్ కి ఓ గుడ్ న్యూస్. షావోమీ ఇండియా.. మన దేశంలో మరో స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. మరి ఆ టీవీ ఫీచర్లు, దాని ధర గురించి తెలుసుకుందామా..?

షావోమీ నుంచి వచ్చిన మరో సరికొత్త స్మార్ట్ టీవీ.. షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ ప్రో. ఇది 32 అంగుళాల స్మార్ట్ టీవీ. ఇందులో డాల్బీ ఆడియో, 24వాట్ స్పీకర్స్, సరికొత్త ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ ధర రూ.16,999. ఈ స్మార్ట్ టీవీని షావోమీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎంఐ హోమ్ స్టోర్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్స్‌లో కొనొచ్చు. లోకల్ రీటైలర్ దగ్గర ఈ స్మార్ట్ టీవీ కొనాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ ప్రో మోడల్‌ను రూ.15,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. సేల్ త్వరలో ప్రారంభం కానుంది.

షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ ప్రో ఫీచర్స్ ఏంటంటే.. షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ ప్రో 32 అంగుళాల స్మార్ట్ టీవీ ఎంట్రీ లెవెల్ మోడల్. ఇప్పటివరకు సాధారణ ఎల్ఈడీ టీవీ ఉపయోగించినవారు స్మార్ట్ టీవీ ట్రై చేయాలనుకుంటే ఈ మోడల్ తీసుకోవచ్చు. ఇందులో 32 అంగుళాల హెచ్‌డీ రెడీ స్క్రీన్ ఉంటుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఉంది. ప్రీమియం మెటల్ బెజెల్ లెస్ ఫ్రేమ్ ఉంటుంది. 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. చిన్నగదిలో స్మార్ట్ టీవీ కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. ఫైన్ ట్యూనింగ్ కలర్స్ కోసం వివిడ్ పిక్చర్ ఇంజిన్ ఉంది.

షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ ప్రో 32 అంగుళాల మోడల్‌లో 24వాట్ స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ ఆడియో డీటీఎస్-ఎక్స్, డీటీఎస్ వర్చువల్ ఎక్స్ టెక్నాలజీస్ సపోర్ట్ ఉంది. క్వాడ్ కోర్ కార్టెక్స్ ఏ55 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కార్టెక్స్ ఏ35 ప్రాసెసర్‌కు అప్‌గ్రేడ్ ప్రాసెసర్ ఇది. ఇందులో 1.5జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ ప్రో ఆండ్రాయిడ్ టీవీ 11 బేస్డ్ ప్యాచ్‌వాల్ ఆఫరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్‌గా లభిస్తుంది. 30 పైగా భారతీయ భాషలు, ఇంటర్నేషనల్ కంటెంట్ పార్ట్‌నర్స్‌తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. 300 పైగా లైవ్ ఛానెల్స్ చూడొచ్చు. పేరెంటెల్ లాక్‌తో కిడ్స్ మోడ్ ఉంటుంది. రిమోట్‌లో క్విక్ మ్యూట్, క్విక్ వేక్, క్విక్ సెట్టింగ్స్ లాంటి బటన్స్ కూడా ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్ సాయంతో ఆపరేట్ చేయొచ్చు. 15పైగా భాషలతో ఆపరేట్ చేయొచ్చు. ఇందులో 2 హెచ్‌డీఎంఐ 2.0 పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, 1 ఎథర్నెట్ పోర్ట్, 3.5ఎంఎం జాక్, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version