చంద్రబాబు ప్రగతి పథంలో నడిపిన నవ్యాంధ్రను.. సీఎం జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు టిడిపి పోలీట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. సీఎం జగన్ అబద్దాలకు, అప్పులకు అంతే లేకుండా పోతుందని విమర్శించారు. అత్యంత కీలకమైన విద్య వైద్యం వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఏపీ జీవనాడి పోలవరాన్ని నిలిపివేయడం జగన్ దుర్మార్గ పాలనకు నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు ఉపయోగపడే పథకాలను నిర్వీర్యం చేశారని అన్నారు. పాలనా వైఫల్యాలనుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రజల మధ్య కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టారని అన్నారు. టిడిపి హయంలో 0 వడ్డీ కింద రాయితీ 2000 కోట్ల మీద ఇస్తే దానిని సీఎం జగన్ ప్రభుత్వం రూ.487 కోట్లకు కోత కోసిందని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో పారాసిటమాల్ టాబ్లెట్లు కూడా దొరకని దయనీయ పరిస్థితి నెలకొందన్నారు.