మీరు టెన్షన్ చెందవద్దు… ప్రశాంతంగా ఉండండి : యనమల

-

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన నేడు పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న కర్నూలులో చంద్రబాబు చేసిన ఆవేశపూరితమైన ప్రసంగం పట్ల స్పందించారు. కర్నూలులో మీ ఆవేశం చూసి మేం బాధపడ్డాం అని యనమల వెల్లడించారు. మీరు టెన్షన్ చెందవద్దు… ప్రశాంతంగా ఉండండి… మాకు తగిన సలహాలు ఇవ్వండి అంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తే టీడీపీని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని, అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో చంద్రబాబు సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

ఇంతకుముందు మాదిరే ప్రతి మూడు జిల్లాలకు ఓ ఇన్చార్జిని నియమించాలని యనమల సూచించారు.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టీడీపీ నాయకులు రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉండాలని.. అందరూ కలిసి పనిచేస్తే టీడీపీకి 160 కంటే ఎక్కువ సీట్లే వస్తాయని అన్నారు. టీడీపీ గెలవడం ఖాయమని… అయితే గెలుస్తామనే ధీమాతో ఉండొద్దని చెప్పారు. ఇవే తన చివరి ఎన్నికలని చంద్రబాబు చెపితే కొందరు పిచ్చి కుక్కల్లా మాట్లాడారని… అవును చివరి ఎన్నికలే… జగన్ దుర్మార్గపు పాలన నుంచి విముక్తి కలిగించడానికి ఇవే చివరి ఎన్నికలని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version