యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బర్త్ డే బాయ్ యష్..

కేజీఎఫ్ ఫ్రాంచైజ్ నుంచి తాజాగా వస్తున్న మూవీ కేజీఎఫ్ 2. కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు యష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేస్తానన్న మేకర్స్.. ఒక రోజు ముందుగానే అది లీక్ కావడంతో నిన్ననే రిలీజ్ చేశారు. ఇక టీజర్ లో హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ అపియరెన్స్, అధీరాగా సంజయ్ దత్ ఎంట్రీ, రామీకా సేన్ ఎలివేషన్స్ ఇలా అన్నీ ఒక రేంజ్ లో ఉన్నాయి.

కేజీఎఫ్ మొదటి భాగం భారీ విజయం సాధించడంతో.. ఈ సీక్వెల్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్‌ తో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ ఈ ప్రాజెక్ట్‌ లో భాగం కావడంతో అన్ని ఇండస్ట్రీల్లోనూ కేజీఎఫ్ 2 మీద బారీ అంచనాలు ఉన్నాయి. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 79 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్ సంపాదించి ఎవరికీ సాధ్యం కాని రికార్డును కొట్టేసింది. అలాగే కేవలం పది గంటల వ్యవధిలోనే 15 మిలియన్స్ వ్యూస్‌ సాధించి మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతోంది.