Yatra 2 :యాత్ర 2 సినిమా నుంచి “చూడు నాన” వీడియో సాంగ్‌ అప్‌డేట్‌….

-

ఆంధ్రప్రదేశ్‌ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కి సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం యాత్ర .వైఎస్సార్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటించారు. దీనికి కొనసాగింపుగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో సీక్వెల్‌ యాత్ర 2 కూడా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.మహి వి రాఘవ్ ఈ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

యాత్ర 2 నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్లు, గ్లింప్స్ ,టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. తండ్రీకొడుకులు మిలియన్ల సంఖ్యలో జనాల మనసులో ఎలాంటి చెరగని ముద్రవేసుకున్నారో తెలిపే ‘సాగే చూడు నాన’ వీడియో పాటను రేపు ఉదయం 11 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఓదార్పు యాత్రలో ఉన్న తాజా లుక్ సినిమాపై క్యూరియాసిటిని పెంచుతుంది.ప్రజా సంక్షేమం కోసం తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్‌ జగన్ చేసిన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకున్నారనే నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version