ఆ రెండు సీట్లు వైసీపీ మళ్ళీ వదులుకుంటుందా?

-

ఏపీలో అధికార వైసీపీ ఎంత బలంతో ఉందో చెప్పాల్సిన పని లేదు…రాష్ట్రమంతా స్ట్రాంగ్ గా ఉంది..అయితే ఇంత స్ట్రాంగ్ గా ఉన్న వైసీపీ సైతం కొన్ని చోట్ల వీక్ గా ఉంది..ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల సరైన నాయకులు దొరకట్లేదు…ఇక ఇదే పరిస్తితి ఎన్నికల వరకు కొనసాగి..అప్పుడు ఏదో మొక్కుబడిగా అభ్యర్ధులని పెడితే..ఆ స్థానాల్లో వైసీపీ గెలవడం చాలా కష్టమనే చెప్పొచ్చు.

అలా వైసీపీకి గెలుపు కష్టమనే స్థానాల్లో శ్రీకాకుళం, విజయవాడ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో జగన్ గాలిని ఎదురుకుని మరీ టీడీపీ మూడు ఎంపీలని గెలుచుకున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు, విజయవాడలో కేశినేని నాని, గుంటూరులో గల్లా జయదేవ్ గెలిచారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఈ మూడు స్థానాల్లో టీడీపీ బలం తగ్గుతున్నట్లు కనిపించడం లేదు…పైగా గుంటూరు మినహా మిగిలిన రెండు స్థానాల్లో వైసీపీకి సరైన అభ్యర్ధులు కూడా కనబడటం లేదు.

గత ఎన్నికల్లో గుంటూరులో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి..గుంటూరులో ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నారు. కానీ విజయవాడలో ఓడిపోయిన పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) అడ్రెస్ లేరు. అలాగే శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడుపై ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్…టెక్కలి ఇంచార్జ్ గా వెళ్ళిపోయారు. దీంతో శ్రీకాకుళం పార్లమెంట్ లో వైసీపీకి నాయకుడు లేడు.

ముందు విజయవాడ సంగతి చూసుకుంటే ఇక్కడ టీడీపీ ఎంపీ కేశినేని చాలా స్ట్రాంగ్ ఉన్నారు..ఆయనకు సొంత బలం ఎక్కువే. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆయనే పోటీ చేయొచ్చు. కానీ వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. మళ్ళీ పీవీపీకి సీటు ఇవ్వడం జరగదు..అటు దాసరి జై రమేష్ వైసీపీలో ఉన్నారు గాని, ఆయన యాక్టివ్ గా ఉండటం లేదు. దీంతో విజయవాడ పార్లమెంట్ లో వైసీపీ వీక్ గా కనిపిస్తోంది.

ఇక శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు ఎంత స్ట్రాంగో చెప్పాల్సిన పని లేదు. ఆయనని ఢీకొట్టే నేత వైసీపీలో కనబడటం లేదు. కనీసం ఇప్పటినుంచైనా సరైన నాయకుడుకు శ్రీకాకుళం బాధ్యతలు అప్పగిస్తే…ఎన్నికల నాటికి రామ్మోహన్ నాయుడుకు గట్టి ఇవ్వొచ్చు. అలా కాకుండా ఎన్నికల సమయంలో అభ్యర్ధిని పెడితే మళ్ళీ వైసీపీ నష్టపోవాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version