ఈ రోజు మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో వారాహి విజయయాత్ర కమిటీలతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షను నిర్వహించారు. ఇందులో భాగంగా వీరితో మొన్నే ముగిసిన మొదటి వారాహి యాత్ర గురించి చర్చించుకుని.. ఏలూరు నుండి రేపటి నుండి మొదలు కానున్న వారాహి యాత్ర 2 గురించి చర్చించుకున్నారు. ఏలూరు నుండి ప్రారంభం కానున్న ఈ యాత్ర తాడేపల్లిగూడెం లో చివరగా ముగియనుంది. కాగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గోదావరి జిల్లాలో జరిగిన వారాహి మొదటి యాత్ర సక్సె ఫుల్ అయింది, ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన గెలుస్తుంది, వైసీపీ కనీసం ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదని గట్టిగా చెప్పాడు.
గోదావరి జిల్లాల నుండే వైసీపీ పఠనం స్టార్ట్: పవన్ కళ్యాణ్
-