అధికారంలోకి వస్తే.. నిరు పేదలందరికీ ఇండ్లు కట్టిస్తా : పొన్నం

-

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులైన నిరు పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా
తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ లో గుడిసెలు వేసుకుని ఉంటున్న నిరుపేదలను కలిశారు పొన్నం ప్రభాకర్. 30 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని ఉంటున్నామని.. ఇప్పటికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదని పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు నిరుపేదలు.తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకపోగా SRSP స్థలంలో ఉన్నారంటూ గుడిసెలు కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇండ్లు కట్టించి ఇస్తామని నిరుపేదలకు భరోసా ఇచ్చారు పొన్నం ప్రభాకర్.

రాష్ట్రంలో బీజేపీ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకునేందుకే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలోనే సీఎం కేసీఆర్ కాకతీయ టెక్స్ టైల్స్ పార్కుకు శంకుస్థాపన చేశారని..రూ. 3500 కోట్లు 30 వేల ఉద్యోగాలని చెప్పి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. ఇప్పటికే శంకుస్థాపన చేసిన టెక్స్ టైల్ పార్క్ కు మళ్లీ ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారా అని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version