మాజీ సీఎంలు, మంత్రులు చాలామంది జైలుకు వెళ్లారు: విజయసాయిరెడ్డి

-

చంద్రబాబు అనారోగ్యంపై రకరకాల కథనాలు బయటికి వస్తున్నాయి. గత 32 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన డిహైడ్రేషన్ తో పాటు అలర్జీకి గురయ్యారని తెలుస్తోంది. దీనిపై కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటు టిడిపి నాయకులు సైతం చంద్రబాబు అనారోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఐదు కిలోల బరువు తగ్గారని ఆయన సతీమణి భువనేశ్వరి చెబుతున్నారు. దీనిపై వైసీపీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు చాలామంది జైలుకు వెళ్లారని, కానీ అచ్చన్నలా ఏ పార్టీ వాళ్ళూ ఇలా దిగజారుడు ఆరోపణలు చేయలేదని మండిపడ్డారు. కారాగారంలో ఆయనకు (చంద్రబాబుకు) ప్రాణహాని ఉందా? లోపల ఆయన హాయిగా, ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారని పేర్కొన్నారు. మెప్పుకోసం మీరు ఏదో ఒకటి చెప్పి మానసిక క్షోభకు గురిచేయకండని సూచించారు. ఇంటి భోజనంతో కూడా వెయిట్ లాస్ ఎలా అయ్యారో మీరే చెప్పాలన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version