ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మంది వైసీపీ నేతల వ్యవహారం రాష్ట్ర సర్కార్ కు కూడా తలనొప్పిగా మారింది. తాజాగా హోం మంత్రి సుచరిత నియోజకవర్గం లో భూకబ్జా వ్యవహారం సంచలనం అయింది. నల్లపాడు పంచాయతీ పరిధిలో 7.84 ఎకరాల భూమి కబ్జా చేసారు వైకాపా నేతలు. 1970 లో భూమిలో ప్లాట్ లు కొనుగోలు చేసి అనసూయమ్మ కాలనీగా ఏర్పాటు చేసారు.
పక్కా గృహాలు ఏర్పాటు చేసుకొని నివాసాలు ఉంటున్నాయి 101 కుటుంబాలు. 50 ఏళ్ళ తర్వాతా ఆన్ లైన్ లో చల్లా అచ్చమ్మ పేరుతో పొలం మార్చడం సంచలనం అయింది. చల్లా అచ్చమ్మ తాలుకు అంటూ కాలనీ లోకి కొందరు అధికార పార్టీ నేతలు వస్తున్నారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికార పార్టీ నేత చల్లా శ్రీనివాసరెడ్డి బెదిరింపులకు దిగారు. అయితే స్థానికులు పోలీసుల వద్దకు వెళ్ళారు.
అయినా సరే కనీసం ఫిర్యాదు కూడా స్థానిక పోలీసులు, రెవిన్యూ అధికారులు తీసుకోలేదు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కొడుకులకు జీ.పి చేసినట్లు డాక్యుమెంట్ లు ఉన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కోర్టు ను కాలనీ వాసులు ఆశ్రయించారు. ఈ వ్యవహారం హోం మంత్రి వద్దకు కూడా వెళ్లినట్టుగా తెలుస్తుంది.