పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు. పోలవరం నిర్మాణం పూర్తికి 60 వేల కోట్లు ఖర్చు అవుతాయి. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పోలవరం కి నిధులు ఇవ్వాలి అని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేసారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గితే పూర్తిగా నష్టం జరుగుతుంది. పోలవరంలో పూర్తి స్థాయిలో నీరు నిల్వచేసుకోకపోతే ఎలా.. కేంద్రం పోలవరం కు డబ్బులు ఇవ్వకపోతే రాష్ట్రం భరిస్తుందా అని ప్రశ్నించారు.
అలాగే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని.. స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇవ్వడం బాగానే ఉంది, కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పండి అంటూ కేంద్రాన్ని కొరారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ “ఎయిర్ ఇండియా”కు కూడా ముందుగా నిధులు ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని అమ్మేశారు. టిడిపి ఎంపీలు వ్యక్తిగతంగా మమ్మల్ని తిడుతున్నారు. కానీ రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం, టిడిపి ఎంపీలతో కలిసి ముందుకు వెళ్తాం. కేంద్రం మీ మద్దతుతో నిలుస్తుందని అంటున్నారు, మరి ఆ స్థాయిలో నిధులు ఎందుకు తెచ్చుకోవడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కొరకు టిడిపి ఎంపీలు గట్టిగా మాట్లాడాలి అని వైసీపీ ఎంపీ అన్నారు.