ఈ మధ్యకాలంలో చాలామందికి మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. సాధరణ తలనొప్పి కంటే..దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనం ఇది రావడానికి కారణాలు.. నాచురల్గా తగ్గించుకునే మార్గాలు చూద్దాం.
మైగ్రేన్ కు ప్రధాన కారణాలు:
తలనొప్పి ఒకసారి మొదలైతే రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది. కొంతమందికి వారం రోజులు పైనే ఉంటుంది. ఈ మైగ్రేన్ రావడానికి ప్రధాన కారణం మోషన్ సరిగ్గా వెళ్లకపోవడం. పేగులు బాగోనప్పుడు ఈ అసౌకర్యం అంతా..బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది.
ఇక రెండవ కారణం…టీ, కాఫీలు బాగా తాగడం..డైలీ తాగుతూ..ఆ సమయానికి అవి అందకపోతే..తలనొప్పి ఎక్కువగా వచ్చేస్తుంది.
ఎండలోకి వెళ్తే వచ్చే తలనొప్పిలన్నీ కూడా మంచినీళ్లు తక్కువ తాగే అలవాటు వల్ల ఆ టైంలో వేడిని తట్టుకోలేక తలలో ఇరిటేషన్ స్టాట్ అవుతుంది.
ఆహారం సరిగ్గా అరగక, గ్యాస్ ఫామ్ అవుతుంది. ముఖ్యంగా సెరిటోనిన్ అనే హార్మోన్ ప్రేగుల్లో రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ కరెక్టుగా రిలీజ్ అయితే బాగుంటుంది. కానీ జంక్ ఫుడ్స్ లాంటివి తినటం వల్ల , ఇరెగ్యులర్ గా తినటం వల్ల ఆ హార్మోన్ తగ్గుతుంది. మెదడు చుట్టూ రక్తనాళాలు వాస్తాయి. అలా వాసే సరికి ప్రజర్ అంతా..బ్రెయిన్ సెల్స్ మీద పడి తలనొప్పి ఎక్కువగా వస్తుంది.
ఇక చాలామందికి స్ట్రెస్ట్ వల్ల, టెక్షన్ వల్ల వస్తాయి..నిద్రలేక, మనసుబాగోక కూడా కొన్నిసార్లు వస్తాయి. ఇవి ముఖ్యమైన కారణాలు.
ఒక పక్కే ఎక్కువ నొప్పి వస్తుంది. కనుబొమ్మల పైనుంచి వస్తుంది. అందుకే దీన్ని పార్శ్యపు నొప్పి అంటారు. ఎక్కువమందికి మైగ్రేన్ రావడానికి మూల కారణం..మలబద్ధకం, ఇన్ డైజేషన్ సమస్య. తలనొప్పి వచ్చినప్పుడల్లా వికారంగా ఉంటుంది. వాంతి అయితే బాగుండు అనిపిస్తుంది..కానీ వాంతి కాదు. వాంతయ్యే వరకూ ఎన్నో గంటలు తలనొప్పితో బాధపడతుంటారు. ఇక కుదురు ఉండదు..నోట్లో లాలాజలం రావడం, కళ్లు తిరగటం ఈ లక్షణాలన్నీ ఉంటాయి. పొట్టలో ఉండే అసౌకర్యం వల్ల ఇదంతా వస్తుంది. అలాంటప్పుడు ఒక లీటర్ నర, రెండులీటర్లు గోరువెచ్చని నీళ్లు తాగేసి కక్కేస్తే వెంటనే ఉపశమనం వస్తుంది.
మైగ్రేన్ నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఉదయం లేచిన వెంటనే..కాఫీ/ టీలు మానేసి..గోరువెచ్చని నీళ్లు లీటర్ నుంటి లీటర్ పావు తాగండి. ఆ తర్వాత మోషన్ కు వెళ్లడానికి ట్రై చేయండి. ఫ్రీ మోషన్ అవ్వాలి. కొందరికి నీళ్లు తాగినా మోషన్ రాదు..అలాంటివారు..సర్జికల్ షాపుల్లో ఎనిమా డబ్బా తీసుకుని ఎనిమా చేసుకోండి. అది ఒక నాలుగు ఐదు రోజులు చేసుకుంటే..ప్రేగుల్లో ఉన్న మలం అంతా రెండుమూడు కేజీలు వరకూ ఉంటుంది..మొత్తం క్లీన్ అయిపోతుంది. చాలా వేస్ట్ క్లీన్ అవుతుంది.
టీ/ కాఫీలు మానేయమన్నాం కదా..మరి ఆ స్థానంలో ఏదో ఒకటి తాగితే..మీ బ్రెయిన్ ఇరిటేషన్ కు గురికాదు..కాబట్టి పొయ్యిమీద నీళ్లు పెట్టి అందులో కాస్త తులసీఆకులు, పుదినా, కొంచెం అల్లం వేసి మరిగించి ఆ తర్వాత ఫిల్టర్ చేయండి. అందులో తేనె, నిమ్మరసం వేసి వేడి వేడిగా తాగండి. నర్వస్ ను రిలాక్షేషన్ కలిగిస్తుంది.
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఫ్రూట్స్ హే తీసుకోండి..డిన్నర్ లో కూడా ఫ్రూట్స్ హే తినండి..కేవలం మధ్యాహ్నం భోజనం చేయండి. ఆ భోజనం కూడా బాగా నమిలి తినాలి..స్లోగా తినాలి. అప్పుడే డైజెషన్ బాగా అవుతుంది. మధ్యాహ్నం పడుకునేప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో రెండుమూడు స్పూన్ల తెనె ఒక నిమ్మచెక్క రసం వేసుకుని తాగండి. మంచినీళ్లు రోజు నాలుగు లీటర్లు తాగండి. ఇలా చేస్తే..మీకు మైగ్రేన్ నొప్పి అనేది రాదు. వీటితో పాటు వీలైనంత వరకూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి..ఎప్పుడు కోపం అనిపించినా, ప్రజర్ అనిపించినా..వెంటనే ఇష్టమైన వారిని, ఫన్నీ ఇన్సిడెంట్స్ ని తలుచుకోండి. మైండ్ కూల్ చేసుకునేందుకు ట్రై చేయండి. మనలో చాలామంది…కోపంలో విచక్షణ కోల్పోతారు..ఇరిటేట్ అవుతారు..కానీ అదే కోపం గంట రెండు గంటల తర్వాత ఉండదు..అలా అని సమస్య ఏమైనా తగ్గుతుందా అంటే..తగ్గకపోవచ్చు కదా..కాబట్టి ఓవర్ రియాక్ట్ అవకుండా ఉంటే..బ్రెయిన్ సెల్స్ పీస్ ఫుల్ గా ఉంటాయి.