బిగ్ బ్రేకింగ్: రఘురామ కాళ్ళకు గాయాలు నిజమే

-

సుప్రీం కోర్ట్ లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసు విచారణ ప్రారంభం అయింది. రఘురామ మెడికల్ రిపోర్ట్ ని న్యాయమూర్తి వినీత్ శరన్ చదివి వినిపించారు. రఘురామ పాదాలకు గాయాలు ఉన్న మాట నిజమే అని ఆయన పేర్కొన్నారు. రఘురామ తరుపు న్యాయవాది ముకుల్ రోహాత్గి మాట్లాడుతూ రఘురామను కష్టడీలో హింసించారు అని కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు.

ప్రభుత్వ న్యాయవాది దవే స్పందిస్తూ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి ఆర్మీ ఆస్పత్రికి మధ్య ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేసారు. దీనిపై కోర్ట్ స్పందించింది. రఘురామ తనకు తాను గాయాలు చేస్తున్నారని భావిస్తున్నారా అని కోర్ట్ ప్రశ్న వేసింది. మిలటరీ ఆస్పత్రి నివేదికను ఇరుపక్షాలకు మెయిల్ ద్వారా పంపిస్తామని చెప్పిన ధర్మాసనం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version