ఎంపీ రఘరామ షాక్‌.. మరోసారి లోక్‌సభ స్పీకర్‌ ను కలిసిన వైసీపీ ఎంపీలు

-

నరసాపురం ఎంపీ రఘరామ కృష్ణం రాజు వ్యవహారంలో వైసీపీ ఎంపీలు మరోసారి లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిశారు. రఘరామ కృష్ణం రాజుపై ఆధారాలతో కూడిన అనర్హత పిటిషన్‌ ను మరోసారి స్పీకర్‌ ఓం బిర్లాకు అందజేశారు. రఘ రామ కృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌ ఓం బిర్లాను వైసీపీ పార్టీ నాయకత్వం కోరినట్లుగా తెలుస్తోంది.

లోక్‌ సభ స్వీకర్‌ను కలిసిన వారిలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, లోక్‌ సభ ఎంపీలు మిథున్ రెడ్డి మరియు మార్గని భారత్ ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో లోక్‌ సభ స్పీకర్‌ను కలిశారు వైసీపీ ఎంపీలు. ఇది ఇలా ఉండగా… కొన్ని రోజుల కింద.. రాజద్రోహం కేసు కింద ఎంపీ రఘరామ కృష్ణం రాజును పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే… ప్రస్తుతం ఆయన బెయిల్‌ పై జైలు నుంచి విడుదల అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version