ఏపీలో వాలంటీర్లు ప్రభుత్వంలో భాగంలో కాదని, అసలు అందుకు సంబంధించిన జీవోలు గత ప్రభుత్వం విడుదల చేయలేదని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.తాజాగా పవన్ వ్యాఖ్యలకు వైసీపీ శ్రేణులు కౌంటర్ ఇచ్చారు. గతంలో వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన నియామకం, జీతాల ఉత్తర్వులకు సంబంధించిన జీవో కాపీలను ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
‘మీరు డిప్యూటీ సీఎంగా ఎలా కొనసాగుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఇన్ని జీవోలు ఇచ్చి నియామకాలు చేస్తే అజ్ఞానపు మాటలతో మీ పరువు మీరే తీసుకుంటున్నారు’ అని వైఎస్సార్ సీపీ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.