తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనకు సంబంధించిన ఒక నకిలీ లింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని సైబర్ సెక్యూరిటీ పోలీసులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 6 నుంచి ఈ సర్వే ప్రారంభమైంది. దీంతో సమగ్ర కుటుంబ సర్వేని టార్గెట్గా చేసుకున్న కొందరు సైబర్ నేరగాళ్లు.. ‘కుటుంబ సర్వే’ పేరుతో ఫ్రాడ్ లింక్స్ పంపిస్తున్నారు.
ఎవరైనా ఈ లింక్స్ నిజమే అనుకుని క్లిక్ చేస్తే.. మీ ఖాతాలు ఖాళీ అవడం ఖాయం అని సైబర్ సెక్యూరిటీ వింగ్ నేర విభాగం వార్నింగ్ ఇస్తోంది.ఎవరైనా కుటుంబ సర్వే పేరుతో కాల్స్ చేసి మీ బ్యాంకు వివరాలు, ఓటీపీలు అడిగినా చెప్పొద్దని సూచిస్తున్నారు. అధికారులే నేరుగా ఇంటికి వచ్చిన సర్వే చేస్తారని, అంతేకానీ లింక్స్ పంపించి అందులో డేటా ఫిల్ చేయాలని ప్రభుత్వం అడగదని అవగాహన కల్పిస్తున్నారు. కాగా, ఇటీవల సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఎక్కువగా చదువుకున్న వారే చిక్కుకుంటున్న విషయం తెలిసిందే.