విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైసీపీ..!

-

వైసీపీలో కీలక నేతగా ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి నేను రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను అని నిన్న ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసారు అనేది తెలిసిందే. అయితే ఈరోజు విజయసాయిరెడ్డి రాజీనామా పోస్ట్ పై ఎక్స్ లో వైసీపీ పార్టీ స్పందించింది. మేము మీ నిర్ణయాన్ని ఆమోదించకపోయినప్పటికీ గౌరవిస్తాము. వైసీపీ ఆవిర్భావం నుంచి కష్ట సమయాల్లోనూ, విజయాల్లోనూ మాతో పాటు నిలబడిన మీరు పార్టీకి బలమైన మూలస్తంభాలలో ఒకరు.

అయితే హార్టికల్చర్‌ లో మీ అభిరుచిని కొనసాగించేందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము. మీ అభిప్రాయాలు ఎల్లప్పుడూ గౌరవించబడతాయి. మీ భవిష్యత్ ప్రయత్నాలలో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాము అని పేర్కొంది. అయితే ఏరియాజు ఉదయం తన పదవికి విజయసాయి రెడ్డి రాజీనామా చేయగా.. దానిని ఆమోదించారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనకర్. విజయసాయి రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు పేర్కొంటూ బులిటెన్ విడుదల చేసింది రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడి.

Read more RELATED
Recommended to you

Exit mobile version